పాలకొండ: దేశ 77వ గణతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకుని పాలకొండ జూనియర్ సివిల్ జడ్జి కోర్టు ప్రాంగణంలో సోమవారం వేడుకలు అత్యంత వైభవంగా నిర్వహించారు. ఈ వేడుకల్లో భాగంగా జూనియర్ సివిల్ జడ్జి చందక హరిప్రియ జాతీయ పతాకాన్ని ఆవిష్కరించి, గౌరవ వందనం సమర్పించారు. అనంతరం ఆమె మాట్లాడుతూ భారత రాజ్యాంగం పట్ల ప్రతి ఒక్కరూ గౌరవాన్ని కలిగి ఉండాలని, న్యాయవ్యవస్థ పటిష్టతకు అందరూ కృషి చేయాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో పాలకొండ బార్ అసోసియేషన్ అధ్యక్షులు ఎం. శామ్యూల్ పాల్గొని గణతంత్ర దినోత్సవ ప్రాముఖ్యతను వివరించారు. వారితో పాటు ప్రముఖ న్యాయవాదులు సీమల కృష్ణారావు, యు. మురళీమోహన్రావు, ఎం. వెంకటేశ్వరరావు, కర్రా ravi బి. రామ్మోహన్ రావు, పల్లా మునిస్వామి, ఎన్ని రాజు, బలగ నరసింహ రావు, కె. సూర్య ప్రకాశ రావు, ఏటీవీ గోవిందరాజు, మరియు కె. పద్మలత ఇతర న్యాయవాదులు పెద్ద సంఖ్యలో హాజరయ్యారు. కోర్టు సిబ్బంది, పలువురు న్యాయవాదుల సమక్షంలో జరిగిన ఈ వేడుకలు దేశభక్తి స్ఫూర్తిని నింపాయి.
0 Comments