పార్వతీపురం మన్యం జిల్లా పాలకొండ పట్టణంలో రానున్న ఎంసెట్ పరీక్షలను పురస్కరించుకుని విద్యార్థుల కోసం 45 రోజుల పాటు MRK Sir ఎంసెట్ అకాడమీ ద్వారా ఉచిత కోచింగ్ నిర్వహిస్తున్నారు. కోర్స్ డైరెక్టర్ కనపాక చౌదరి నాయుడు మరియు ఎం ఆర్ కే శ్రీనివాస్ సారధ్యంలో ఈ శిక్షణ తరగతులు ప్రారంభమయ్యాయి. కేవలం ఇంజనీరింగ్ విభాగం విద్యార్థుల కోసం ఉద్దేశించిన ఈ కోచింగ్ ప్రతిరోజూ ఉదయం 9 గంటల నుండి మధ్యాహ్నం 1 గంట వరకు జరుగుతుంది. మ్యాథమెటిక్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీ సబ్జెక్టులలో సుమారు 10 మంది నిపుణులైన అధ్యాపకులు విద్యార్థులకు శిక్షణ ఇస్తున్నారని చౌదరి నాయుడు తెలిపారు. పాలకొండ పట్టణం వడ్డాది వారి వీధిలోని ఎలైట్ జూనియర్ కాలేజీలో ఈ తరగతులు నిర్వహిస్తున్నారు. గత పదేళ్లుగా ఈ శిక్షణ ఇస్తున్నామని, ఇప్పటి వరకు ఎక్కువ మంది విద్యార్థులు వివిధ విభాగాల్లో సీట్లు సాధించారని ఆయన పేర్కొన్నారు. స్థానిక విద్యార్థులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని ప్రతినిధి బి. సి. Nayudu కోరారు.
0 Comments