సత్యసాయి నిత్య అన్నదానానికి లక్ష రూపాయల వితరణ

పాలకొండ వెబ్ న్యూస్, మార్చి 29, 2026:​ పాలకొండ పట్టణానికి చెందిన విజయ దుర్గ హోటల్ యజమాని కొత్తకోట ప్రసాదరావు (బుల్లి) సులోచన దంపతులు తమ దాతృత్వాన్ని చాటుకున్నారు. స్థానిక సత్యసాయి మందిరంలో కొనసాగుతున్న నిత్య అన్నదాన పథకానికి వీరు లక్ష రూపాయల  విరాళాన్ని అందజేశారు. తమ తల్లిదండ్రులు కొత్తకోట సత్యనారాయణ లక్ష్మీకాంతం జ్ఞాపకార్థం ఈ ఆర్థిక సాయాన్ని సత్యసాయి సేవా సమితి ప్రతినిధులకు కుటుంబ సభ్యుల సమక్షంలో అందజేయడం జరిగింది. సమాజ సేవలో భాగంగా అన్నదాన పథకానికి తమ వంతు సహకారం అందించడం సంతోషంగా ఉందని ఈ సందర్భంగా వారు పేర్కొన్నారు. వీరి దాతృత్వాన్ని సత్యసాయి సేవా సమితి సభ్యులు మరియు స్థానికులు  అభినందించారు.

​news by: BSS Prasad

Post a Comment

0 Comments