పాలకొండలో ఉత్సాహంగా సత్య సాయి టాలెంట్ టెస్ట్

​​పాలకొండ వెబ్ న్యూస్, 08-03-2026:​ సరదా చదువులు ఆధ్వర్యంలో నిర్వహించిన సత్య సాయి టాలెంట్ టెస్ట్ పాలకొండ ప్రభుత్వ ఉన్నత పాఠశాల ప్రాంగణంలో ఐదు మరియు ఎనిమిదో తరగతి విద్యార్థులకు ఘనంగా నిర్వహించబడింది. ఈ కార్యక్రమం వీరఘట్టం మండల విద్యాశాఖ అధికారి 2 రాగోలు ఆనందరావు పర్యవేక్షణలో, సరదా చదువులు సంస్థ కన్వీనర్ మరియు కో కన్వీనర్ ఎన్వి రమణ మరియు మరడాన సంపత్ కుమార్ ఆధ్వర్యంలో జరిగింది. ఏడు మండలాల ప్రభుత్వ పాఠశాలల్లో చదువుకుంటున్న ఐదో తరగతి నుంచి 80 మంది, ఎనిమిదో తరగతి నుంచి 80 మంది విద్యార్థులు ఈ రాత పరీక్షకు హాజరైనారు.

​ఈ పోటీల్లో ఐదో తరగతి విభాగంలో ప్రతిభ చాటి మొదటి పది స్థానాల్లో నిలిచిన విద్యార్థులుగా లోహిత్ ఎమ్.సింగపురం, హిమశ్రీ పివిఆర్ పురం, హర్షవర్ధన్ పివిఆర్ పురం, జాస్విక సికబడి, ఎస్ గోవర్ధన్ రావివలస, హర్షవర్ధన్ తుమరాడ, ఎం వాసు గరుగుబిల్లి, వాగ్దేవి కిమ్మీ, కౌశిత్ నాయుడు తప్పటపల్లి, నిఖిల్ కుమార్ రేగిడి మరియు నీలం అక్షయ ఎంపికయ్యారు. నిఖిల్ కుమార్, నీలం అక్షయలకు సమాన మార్కులు రావడంతో వీరిద్దరూ పదివ స్థానాన్ని పంచుకున్నారు.

​ఎనిమిదో తరగతి విభాగం నుంచి కే గీతిక హడ్గో కాలనీ, ఢిల్లీశ్వరి మామిడిపల్లి, జయశంకర్ హట్కో కాలనీ, సూర్య నడుకూరు, ప్రవీణ్ కుమార్ అంబకండి, సురేంద్ర పాలవలస, పి షర్మిల పివిఆర్ పురం, బి గణేష్ హట్కో కాలనీ, కె హర్షవర్ధన్ మామిడిపల్లి, కే ప్రసన్న రావివలస తదితరులు తదుపరి జరగబోయే మౌఖిక పరీక్షకు ఎంపికయ్యారు. ఈ విద్యార్థులకు కంటుమోజు రామ్మోహన్ మాస్టారు, తెన్నేటి పార్వతమ్మ, బల్ల విగ్నేష్, లోచర్ల హరిబాబు సహకారంతో త్వరలో బహుమతి ప్రధానం జరుగుతుంది.

​ఈ కార్యక్రమంలో హేమిని కుమార్, సతీష్ కుమార్, బౌరోతు శంకర్రావు, చిన్న అప్పలనాయుడు, శారదామని, బుచ్చన్న, వాసుదేవరావు, త్రినాధ, గణేష్, లీల ప్రసాద్, గౌరీ శంకర్, వెంకట్, పారయ్య, కృష్ణారావు, గడ్డియ్య, జల్లు రాము, రమేష్ పట్నాయక్, చంద్రమౌళి, వైకుంఠరావు, సతీష్ కుమార్, రాజారావు, కామరాజు, సీతరాజు తదితరులు పాల్గొన్నారు.

​news by: BSS Prasad



Post a Comment

0 Comments