​శ్రీ విజయ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ ఎం.డి దూబ పద్మావతికి గౌరవ డాక్టరేట్ ప్రధానం



​రాజాం/పాలకొండ: సామాజిక సేవా రంగంలో విశేష కృషి చేస్తున్న రాజాం పట్టణానికి చెందిన ప్రముఖ పారిశ్రామికవేత్త, శ్రీ విజయ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ మేనేజింగ్ డైరెక్టర్ దూబ పద్మావతిని అత్యున్నత గౌరవం వరించింది. గత 16 ఏళ్లుగా రాజాం మరియు పాలకొండ ప్రాంతాల్లో ఆమె అందిస్తున్న నిరుపమాన సేవలను గుర్తిస్తూ, అమెరికాకు చెందిన అఫిలేటెడ్ డైస్ప్రింగ్ ఇంటర్నేషనల్ యూనివర్సిటీ (DIU) ఆమెకు గౌరవ డాక్టరేట్‌ను ప్రకటించింది. రిపబ్లిక్ డే సందర్భంగా శ్రీకాకుళంలో నిర్వహించిన ప్రత్యేక కార్యక్రమంలో యూనివర్సిటీ ఛాన్సెలర్ డాక్టర్ ఏమోస్ జేమ్స్ చేతుల మీదుగా పద్మావతి ఈ పట్టాను అందుకున్నారు. ​దూబ పద్మావతి తన భర్త, ఆరోగ్యశ్రీ మేనేజర్ రాంబాబు సహకారంతో 'సంజీవ రక్ష ఫౌండేషన్' ద్వారా మారుమూల గిరిజన ప్రాంతాల్లో నిరంతరం ఉచిత వైద్య శిబిరాలను నిర్వహిస్తున్నారు. కేవలం వైద్య సేవలే కాకుండా, ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థినులకు శానిటరీ ప్యాడ్ల పంపిణీ మరియు వృద్ధులకు అవసరమైన నిత్యావసరాలను అందిస్తూ మానవత్వాన్ని చాటుకుంటున్నారు. ఆపదలో ఉన్న వారికి అండగా నిలుస్తున్న ఆమెకు డాక్టరేట్ లభించడం పట్ల ఉమ్మడి జిల్లాల ప్రజలు, రాజకీయ నాయకులు మరియు అభిమానులు హర్షం వ్యక్తం చేస్తూ అభినందనలు తెలియజేస్తున్నారు.
.. పాలకొండ వెబ్ న్యూస్ 

Post a Comment

0 Comments