పాలకొండలో వైభవంగా కోదండ రామస్వామి కళ్యాణ మహోత్సవం

పాలకొండ వెబ్ న్యూస్, 29 మార్చి, 2026:

​పాలకొండ పట్టణంలోని కోదండ రామస్వామి ఆలయంలో ఆదివారం నాడు కళ్యాణ మహోత్సవం అత్యంత వైభవంగా జరిగింది. ఆలయ అర్చకులు దేవతామూర్తులకు ఆగమశాస్త్రానుసారం ప్రత్యేక పూజాదికాలు నిర్వహించి, కమనీయంగా కళ్యాణ క్రతువును జరిపించారు. ఈ పవిత్ర కార్యక్రమంలో వల్లూరు సత్యనారాయణ, భాగ్యలక్ష్మి దంపతులతో పాటు నందాన రమేశ్, మాధురి దంపతులు ఆదిదేవుని కర్తలుగా వ్యవహరించి పూజల్లో పాల్గొన్నారు. కళ్యాణం అనంతరం భక్తులకు రామ మంగళ శాసనం మరియు తీర్థప్రసాద వితరణ చేపట్టారు. ఈ వేడుకను అర్చకులు పెడలి రమణాచార్యులు, లక్షణాచార్యులు, వెంకట సీతారాంజీ మరియు తాతాజీ శాస్త్రోక్తంగా నిర్వహించారు. పట్టణ ప్రజలు  తరలివచ్చి స్వామివారి కళ్యాణాన్ని తిలకించి పునీతులయ్యారు.

news by: BSS Prasad

Post a Comment

0 Comments