తెలుగు మీడియం విద్యార్థికి గూగుల్ మరియు మైక్రోసాఫ్ట్ సంస్థలలో కోటి రూపాయల ప్యాకేజీతో కొలువు

పాలకొండ వెబ్ న్యూస్..తేదీ: 31 మార్చి, 2026:​పాలకొండ పట్టణం వడమ గ్రామానికి చెందిన బొద్దాన కళ్యాణ్ ప్రసాద్ మరియు పార్వతి దంపతుల కుమారుడు బొద్దాన సంతోష్ అంతర్జాతీయ ఐటీ దిగ్గజ సంస్థలైన గూగుల్ మరియు మైక్రోసాఫ్ట్ లలో సీనియర్ సాఫ్ట్వేర్ ఇంజనీర్ గా ఎంపికై రికార్డు సృష్టించాడు. పదో తరగతి వరకు నవోదయ మోడల్ స్కూల్ లోనూ, ఇంటర్ తమ్మినాయుడు కళాశాలలోనూ తెలుగు మీడియంలో చదివిన సంతోష్, జిఎంఆర్ కళాశాలలో ఇంజనీరింగ్ పూర్తి చేశాడు. ఎస్బీఐలో డేటా సైంటిస్ట్ గా పనిచేస్తూనే బాష్ కంపెనీలో పరిశోధనలు చేసి అంతర్జాతీయ అవార్డులు అందుకున్నాడు. ఐఐఎస్సీ బెంగళూరులో ఎంటెక్ చేస్తూ కఠినమైన కోడింగ్ సాధనతో గూగుల్ నిర్వహించిన పది రౌండ్ల ఇంటర్వ్యూలలో ప్రతిభ చాటి కోటికి పైగా వేతనంతో ఉద్యోగం సాధించాడు. క్రమశిక్షణతో కూడిన శ్రమ, కుటుంబ సభ్యుల ప్రోత్సాహమే తన విజయానికి కారణమని సంతోష్ పేర్కొన్నాడు.

​news by: BSS Prasad

Post a Comment

0 Comments