పాలకొండ వెబ్ న్యూస్..తేదీ: 31 మార్చి, 2026:పాలకొండ పట్టణంలోని స్థానిక కోర్టు ఆవరణలో మంగళవారం బార్ అసోసియేషన్ కార్యవర్గ ఎన్నికలు అత్యంత ఉత్సాహభరిత వాతావరణంలో జరిగాయి. ఈ ఎన్నికలలో బార్ అసోసియేషన్ నూతన ప్రెసిడెంట్ గా పల్లా మునిస్వామి ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. అసోసియేషన్ ఇతర ముఖ్య బాధ్యుల విషయానికి వస్తే వైస్ ప్రెసిడెంట్ గా ఎం.వెంకటేశ్వర్రావు, జనరల్ సెక్రెటరీగా అల్లేన శివదాస్అలాగే జాయింట్ సెక్రెటరీగా ఎన్ని ప్రకాష్ మరియు ట్రెజరర్ గా జగన్మోహన్రావు ఎన్నికయ్యారు. ఎగ్జిక్యూటివ్ మెంబర్లుగా యు మురళి మోహన్ రావు, ఎస్ కృష్ణారావు, కే పద్మలత, ఏవి రమణమూర్తి, ఎన్ గాంధీ, టి. సింహాచలం ఎన్నికైనట్లు ఎన్నికల అధికారులు ప్రకటించారు. నూతనంగా ఎన్నికైన కార్యవర్గ సభ్యులకు తోటి న్యాయవాదులు అభినందనలు తెలియజేశారు. ఈ సందర్భంగా నూతన అధ్యక్షులు మాట్లాడుతూ న్యాయవాదుల సమస్యల పరిష్కారానికి మరియు బార్ అసోసియేషన్ అభివృద్ధికి శక్తివంచన లేకుండా కృషి చేస్తానని హామీ ఇచ్చారు.
news by: BSS Prasad
0 Comments