ప్రాజెక్టుల సాధనకై రైతుల పోరాటం: పార్వతీపురం కలెక్టరేట్ వద్ద భారీ ధర్నా

​పాలకొండ వెబ్ న్యూస్, తే. 09-03-2026:బడ్జెట్‌లో సాగునీటి ప్రాజెక్టులకు నిధులు కేటాయించకుండా ప్రభుత్వం జిల్లాకు తీరని అన్యాయం చేసిందని పేర్కొంటూ ఆంధ్రప్రదేశ్ రైతు, కౌలు రైతు సంఘాల ఆధ్వర్యంలో పార్వతీపురం కలెక్టరేట్ వద్ద ధర్నా నిర్వహించారు. సుందరయ్య భవనం నుండి భారీ ర్యాలీగా తరలివచ్చిన రైతులు ప్రభుత్వ తీరుపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా నాయకులు ఖండా ప్రసాద్, బంటు దాసు, ఎం కృష్ణమూర్తి, రెడ్డి రమణమూర్తి మాట్లాడుతూ తోటపల్లి, జంఝావతి, జంపారుకోట వంటి ప్రాజెక్టులను విస్మరించడం దారుణమన్నారు.

​నిర్వాసితులకు పరిహారం, ఆర్ అండ్ ఆర్ ప్యాకేజీ ఇవ్వకుండా ప్రభుత్వం కాలయాపన చేస్తోందని విమర్శించారు. ట్రిపుల్ ఇంజన్ సర్కార్ అధికారంలో ఉన్నా జిల్లా ప్రాజెక్టుల పరిష్కారానికి చొరవ చూపకపోవడం శోచనీయమని, వెంటనే పది వేల కోట్లు కేటాయించాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో కరణం రవీంద్ర, బి అప్పారావు, ఆర్ సత్యనారాయణ, రెడ్డి వేణు, రంబ లక్ష్మణరావు, పి రాము, ఏ రాము తదితరులు పాల్గొన్నారు.

​News by: BSS Prasad

Post a Comment

0 Comments