పాలకొండ వెబ్ న్యూస్, మార్చి 07, 2026: సమాజంపై ప్రభావం చూపే వివిధ వర్గాల ప్రముఖులతో ప్రత్యేక సమావేశం నిర్వహించాలని సద్భావనా సమితి నిర్ణయించింది. ఈ మేరకు రేపు అనగా మార్చి 8వ తేదీ ఆదివారం సాయంత్రం 5 గంటలకు స్థానిక శ్రీ కృష్ణసాయి డిగ్రీ కళాశాలలో ఈ సద్భావనా సమావేశం జరగనుంది. ఈ కార్యక్రమానికి ప్రధాన వక్తగా ప్రాంత గ్రామ వికాస్ ప్రముఖ్ తిరుపతయ్య హాజరై ప్రసంగించనున్నారు. సామాజిక చైతన్యం మరియు సమన్వయమే లక్ష్యంగా జరుగుతున్న ఈ సదస్సుకు మేధావులు, పెద్దలు తరలివచ్చి విజయవంతం చేయాలని ఖండ సద్భావనా ప్రముఖ్ బూరి సంతోష్ కోరారు. ఇతర వివరాలకు 85208 37608 నంబరును సంప్రదించవచ్చు.
News by: BSS Prasad
0 Comments