ఎన్టీఆర్ ప్రస్థానం 'విశ్వతేజ' అభినందనీయం: మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు

పాలకొండ వెబ్ న్యూస్ , మార్చి 28: తెలుగు జాతి గర్వించదగ్గ మహానటుడు, మాజీ ముఖ్యమంత్రి స్వర్గీయ నందమూరి తారకరామారావు గారి జీవిత విశేషాలతో రూపొందించిన "విశ్వతేజ" పుస్తకం అద్భుతమని మాజీ ఉపరాష్ట్రపతి శ్రీ ముప్పవరపు వెంకయ్య నాయుడు కొనియాడారు. ఈ పుస్తకాన్ని రూపొందించిన శ్రీ కనపాక చౌదరి నాయుడును ఆయన ప్రత్యేకంగా అభినందించారు.తెలుగు జాతి చరిత్రలో శ్రీ రామారావు గారి జీవితం ఆజన్మాంతం గుర్తుంచుకోదగినదని, అటువంటి మహనీయుని ప్రస్థానాన్ని గ్రంథస్థం చేసిన కనపాక చౌదరి నాయుడు ప్రయత్నం ప్రశంసనీయమని వెంకయ్య నాయుడు తన సందేశంలో పేర్కొన్నారు.

Post a Comment

0 Comments