పాలకొండ వెబ్ న్యూస్ : ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం సచివాలయ ఉద్యోగులకు మరో కీలకమైన బాధ్యతను అప్పగించింది. రాష్ట్రవ్యాప్తంగా ప్రతి ఇంట్లో వంటకు ఏ రకమైన ఇంధనాన్ని వాడుతున్నారో తెలుసుకునేందుకు కొత్త సర్వేకు శ్రీకారం చుట్టింది. ఈ వివరాల సేకరణ కోసం ప్రభుత్వం ఇప్పటికే ఒక ప్రత్యేక మొబైల్ యాప్‌ను సిద్ధం చేసింది. ఈ ప్రక్రియ సోమవారం నుంచే ప్రారంభమయ్యే అవకాశం ఉందని అధికార వర్గాలు వెల్లడించాయి.
ఈ సర్వేలో భాగంగా గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగులు స్వయంగా ప్రతి ఇంటికీ వెళ్లి వివరాలు సేకరించాల్సి ఉంటుంది. ప్రజలు వంట కోసం ఇండక్షన్ స్టవ్, కిరోసిన్, కట్టెల పొయ్యి, గోబర్ గ్యాస్ లేదా ఎల్పీజీ సిలిండర్లలో దేనిని వినియోగిస్తున్నారనే అంశాలను యాప్‌లో నమోదు చేస్తారు. ప్రజల ఇంధన వినియోగ అలవాట్లను శాస్త్రీయంగా అంచనా వేసేందుకు ఈ సర్వే ఉపయోగపడనుంది.
0 Comments