పాలకొండ వెబ్ న్యూస్..తేదీ: 22 మార్చి, 2026:ఆండ్రాయిడ్ మొబైల్ వినియోగదారులు ఏపీకే ఫైల్స్ విషయంలో అత్యంత అప్రమత్తంగా ఉండాలని డీజీపీ హరీశ్ కుమార్ గుప్తా ప్రజలకు సూచించారు. ప్రస్తుత కాలంలో రోజుకు వేల సంఖ్యలో ప్రజలు ఈ రకమైన సైబర్ మోసాలకు గురవుతున్నారని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. గుర్తు తెలియని వ్యక్తులు వాట్సప్, ఎస్ఎంఎస్ లేదా టెలిగ్రామ్ ద్వారా పంపే ఏపీకే ఫైల్స్‌ను పొరపాటున క్లిక్ చేస్తే ఫోన్ నియంత్రణ మొత్తం సైబర్ నేరగాళ్ల చేతుల్లోకి వెళ్తుందని ఆయన వివరించారు. దీనివల్ల బ్యాంక్ ఖాతాలు ఖాళీ అయ్యే ప్రమాదం ఉందని హెచ్చరించారు. ప్రభుత్వ సంస్థలు, బ్యాంకులు లేదా టెలికాం కంపెనీలు ఎప్పుడూ వాట్సప్ ద్వారా యాప్‌లను పంపవని గుర్తుంచుకోవాలని కోరారు. అనుమానాస్పద ఫైల్స్‌ను ఇన్స్టాల్ చేయకుండా జాగ్రత్త పడాలని ఆయన స్పష్టం చేశారు.
news by: BSS Prasad
0 Comments