పాలకొండ పట్టణ అభివృద్ధికి మంత్రి నారాయణ హామీ

పాలకొండ వెబ్ న్యూస్, ఫిబ్రవరి 19, 2026:

​ఆంధ్రప్రదేశ్ సచివాలయంలో మున్సిపల్ శాఖ మంత్రి నారాయణను పాలకొండ  ఎమ్మెల్యే నిమ్మక జయకృష్ణ నేతృత్వంలో నగర పంచాయతీ కౌన్సిలర్ కొంచాడ అరుణ్ కుమార్ మరియు జనసేన నాయకులు కొండదాడి రాజేష్ మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా పాలకొండ పట్టణంలోని ప్రధాన సమస్యలపై మంత్రికి వినతిపత్రం అందజేశారు. ముఖ్యంగా పట్టణంలో దీర్ఘకాలంగా వేధిస్తున్న డంపింగ్ యార్డ్ సమస్యను పరిష్కరించాలని మరియు ట్రాఫిక్ ఇబ్బందుల దృష్ట్యా రోడ్ల వైండింగ్ పనులు చేపట్టాలని కోరారు. ఈ సమస్యలపై సానుకూలంగా స్పందించిన మంత్రి నారాయణ, పాలకొండ పట్టణ అభివృద్ధికి అవసరమైన అన్ని చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. 

పాలకొండ నగర పంచాయతీ అభివృద్ధిపై మంత్రి నారాయణకు వినతి

​పాలకొండ వెబ్ న్యూస్, ఫిబ్రవరి 19, 2026:

​పాలకొండ నగర పంచాయతీ పరిధిలోని పలు అభివృద్ధి పనులు మరియు పెండింగ్ సమస్యలను పరిష్కరించాలని కోరుతూ ఎమ్మెల్యే నిమ్మక జయకృష్ణ ఆధ్వర్యంలో అరకు పార్లమెంట్ టీడీపీ అధికార ప్రతినిధి గంటా సంతోష్ కుమార్ మరియు కూటమి నాయకులు అమరావతిలో మున్సిపల్ శాఖ మంత్రి నారాయణను కలిశారు. ఈ సందర్భంగా పట్టణంలోని నిధుల కొరత మరియు కార్మికుల సమస్యలను మంత్రి దృష్టికి తీసుకెళ్లారు. ముఖ్యంగా 6.60 లక్షల అంచనా వ్యయంతో కూడిన నూతన పనులకు నిధుల మంజూరుతో పాటు, నాన్ అమృత్ పథకం కింద 72 కోట్లతో చేపట్టే తాగునీటి ప్రాజెక్టుకు సంబంధించిన స్థల సమస్యను త్వరితగతిన పరిష్కరించాలని కోరారు. అలాగే రిజిస్ట్రేషన్ల ద్వారా రావాల్సిన ఆదాయాన్ని విడుదల చేసి మున్సిపల్ కార్మికుల వేతనాలు చెల్లించాలని విన్నవించారు. ఈ అంశాలపై సానుకూలంగా స్పందించిన మంత్రి నారాయణ, సమస్యల పరిష్కారానికి అధికారులను ఆదేశిస్తామని హామీ ఇచ్చారు.

​news by: BSS Prasad

Post a Comment

0 Comments