వీరఘట్టంలో సంతోషిమాత ఆలయ ముఖద్వారం ప్రారంభం

పాలకొండ వెబ్ న్యూస్..తేదీ: 28-02-2026:​పార్వతిపురం మన్యం జిల్లా వీరఘట్టం పట్టణంలో వెలిసిన సంతోషిమాత ఆలయ 16వ వార్షికోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆలయ నూతన ముఖద్వారాన్ని శాసనసభ్యులు నిమ్మక జయకృష్ణ ఆదేశాల మేరకు ప్రముఖులు ప్రారంభించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా మాజీ తోటపల్లి ప్రాజెక్ట్ చైర్మన్ నిమ్మక పాండురంగ మరియు కూటమి నాయకులు హాజరయ్యారు. వేడుకలో భాగంగా ప్రత్యేక పూజలు నిర్వహించి భక్తులకు తీర్థప్రసాదాలు అందజేశారు.

​ఈ కార్యక్రమంలో నిమ్మక పాండురంగతో పాటు ఉదయాన ఉదయ్ భాస్కర్, జామి లక్ష్మి నారాయణ, బళ్ళ హరిబాబు, జనసేన జానీ, తూముల రమేష్ మరియు ఇతర మండల స్థాయి అధికారులు, కూటమి నాయకులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. ఆలయ ధర్మకర్తలు మరియు స్థానిక ప్రజలు మాట్లాడుతూ ఆలయానికి రహదారి సౌకర్యం కల్పించినందుకు నిమ్మక జయకృష్ణకు ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేశారు. పట్టణ అభివృద్ధిలో భాగంగా ఆలయ పరిసరాలను మెరుగుపరచడం పట్ల స్థానికులు హర్షం వ్యక్తం చేశారు.

​news by: BSS Prasad

Post a Comment

0 Comments