పాలకొండలో అమరజీవి పొట్టి శ్రీరాములు వర్ధంతి

పాలకొండ వెబ్ న్యూస్ : ప్రత్యేక ఆంధ్ర రాష్ట్ర సాధన కోసం తన ప్రాణాలను త్యాగం చేసిన అమరజీవి పొట్టి శ్రీరాములు గారి వర్ధంతిని పురస్కరించుకుని, పాలకొండ మండల ప్రజా పరిషత్ (ఎంపీపీ) కార్యాలయంలో ఈరోజు ఉదయం నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా పొట్టి శ్రీరాములు చిత్రపటానికి పాలకొండ మండల పరిషత్ అధ్యక్ష ప్రతినిధి బొమ్మాలి సుధాకర్ రావు మరియు మండల పరిషత్ అభివృద్ధి అధికారి (ఎంపీడీఓ) ఎంవీ రంగారావు పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఆంధ్ర రాష్ట్ర సాధనలో ఆయన చేసిన మహోన్నత త్యాగాన్ని వారు స్మరించుకున్నారు. ఈ కార్యక్రమంలో పాలకొండ మండల పరిషత్ కార్యాలయ సిబ్బంది పాల్గొన్నారు.

Post a Comment

0 Comments