ఉమ్మడి శ్రీకాకుళం జిల్లాలోని పాలకొండ, వీరఘట్టం, బూర్జ మండలాల్లో చలి తీవ్రత పెరిగిన దృష్ట్యా, టి.ఎల్. నాయుడు కోచింగ్ సెంటర్ డైరెక్టర్ టి. మధుబాబు మానవతా దృక్పథంతో పేదలకు అండగా నిలిచారు.
ఆర్థికంగా వెనుకబడిన వర్గాల ప్రజలు, వృద్ధులు, నిరాశ్రయులు చలి బాధను తట్టుకునేందుకు వీలుగా ఆయన ఈ మూడు మండలాల పరిధిలోని పలు గ్రామాలలో వందలాది దుప్పట్లను పంపిణీ చేశారు.
ఈ సందర్భంగా మధుబాబు మాట్లాడుతూ, సమాజంలో తోటివారికి సాయం అందించడం ప్రతి ఒక్కరి బాధ్యత అని, కనీసం ఈ దుప్పట్లు చలికాలంలో పేదలకు కొంత ఉపశమనం కలిగిస్తాయని ఆకాంక్షించారు..
0 Comments