డి.ఐ.ఈ.ఓ. ఆకస్మిక తనిఖీ: పరీక్షలు, రికార్డులపై సంతృప్తి

 పాలకొండ వెబ్ న్యూస్ : పార్వతిపురం మన్యం జిల్లా ఇంటర్మీడియట్ విద్య శాఖాధికారి (డి.ఐ.ఈ.ఓ.) శ్రీ వై. నాగేశ్వరరావు పాలకొండలో ఆకస్మిక తనిఖీ నిర్వహించారు. ఆయన స్థానిక ప్రభుత్వ జూనియర్ కళాశాల (బాలురు) మరియు బాలికల కళాశాలలను సందర్శించారు. నిన్నటి నుంచి జరుగుతున్న ప్రీ-ఫైనల్ పరీక్షల తీరును డి.ఐ.ఈ.ఓ. పరిశీలించారు. జంబ్లింగ్ పద్ధతిలో జరుగుతున్న ఈ పరీక్షల నిర్వహణ పట్ల ఆయన సంతృప్తి వ్యక్తం చేశారు. అనంతరం ఆయన అధ్యాపకులు, సిబ్బంది హాజరు పట్టిని క్షుణ్ణంగా తనిఖీ చేశారు. కళాశాల రికార్డులను కూడా పరిశీలించిన అధికారి, వాటి నిర్వహణపై సంతృప్తి చెందారు. మధ్యాహ్న భోజనం జరుగుతున్న తీరును తెలుసుకునేందుకు ఆయన స్వయంగా విద్యార్థులను అడిగారు. విద్యార్థులు ఇచ్చిన సమాధానాల పట్ల డి.ఐ.ఈ.ఓ. సంతృప్తిని వ్యక్తం చేశారు. రానున్న పబ్లిక్ పరీక్షల్లో విద్యార్థులందరూ తప్పక ఉత్తీర్ణులు కావాలని ఆయన ఈ సందర్భంగా వారికి తెలియజేశారు. కళాశాలలో నిర్వహిస్తున్న స్టడీ అవర్స్ గురించి ప్రిన్సిపాల్ శ్రీ వి. హరిగోపాల్‌ను అడిగి వివరాలు తెలుసుకున్నారు. ఈ తనిఖీలో ఆయన వెంట కళాశాల ప్రిన్సిపాల్ వి. హరిగోపాల్, సీనియర్ అధ్యాపకులు వెలమల అప్పారావు, గోవిందరావు, వెంకటరమణ, విజయ్ కుమార్ మరియు వీరఘట్టం ప్రభుత్వ జూనియర్ కళాశాల బోటనీ అధ్యాపకులు తెర్లి మల్లికార్జున రావు పాల్గొన్నారు.

Post a Comment

0 Comments