ఏపీ లాసెట్-2026 దరఖాస్తుల ఆహ్వానం


పాలకొండ వెబ్ న్యూస్, ఫిబ్రవరి 21, 2026:​ రాష్ట్ర ఉన్నత విద్యామండలి ఆధ్వర్యంలో నిర్వహించే ఏపీ లాసెట్ మరియు పీజీ లాసెట్-2026 ప్రవేశ పరీక్షలకు దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు కన్వీనర్, మహిళా వర్సిటీ న్యాయవిభాగం ఆచార్యులు సీతాకుమారి ఒక ప్రకటనలో తెలిపారు. తిరుపతిలోని శ్రీ పద్మావతి మహిళా విశ్వవిద్యాలయం ఈ పరీక్షలను నిర్వహిస్తోంది. మూడు మరియు ఐదేళ్ల ఎల్ఎల్బీ కోర్సులతో పాటు రెండేళ్ల ఎల్ఎల్ఎం కోర్సుల్లో ప్రవేశం పొందగోరే అభ్యర్థులు వచ్చే నెల 12వ తేదీలోపు తమ దరఖాస్తులను సమర్పించాల్సి ఉంటుంది. గడువు ముగిసిన తర్వాత అపరాధ రుసుముతో మార్చి 28 వరకు దరఖాస్తు చేసుకునే అవకాశం కల్పించారు. మే 4వ తేదీన రాష్ట్రవ్యాప్తంగా ప్రవేశ పరీక్షలు జరుగుతాయని అధికారులు వెల్లడించారు. ఇతర పూర్తి వివరాల కోసం అభ్యర్థులు అధికారిక వెబ్‌సైట్ పరిశీలించాలని కన్వీనర్ సూచించారు.

​news by: BSS Prasad

Post a Comment

0 Comments