పాలకొండ వెబ్ న్యూస్, ఫిబ్రవరి 21, 2025:పాలకొండ ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో అంతర్జాతీయ మాతృభాషా దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా పాఠశాల ప్రధానోపాధ్యాయులు తెలుగు తల్లి చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. ప్రతి విద్యార్థికి తెలుగులో స్పష్టంగా రాయడం మరియు చదవడం తప్పనిసరిగా రావాలని ఆయన ఆకాంక్షించారు. పార్వతీపురం మన్యం జిల్లా కలెక్టర్ డాక్టర్ ఎన్ ప్రభాకర్ రెడ్డి ఆదేశాల మేరకు పాఠశాలకు చెందిన 50 మంది విద్యార్థులు 50 కథలు మరియు కవితలను రచించారని ప్రధాన సంపాదకులు, సంస్కృత పండితులు బౌరోతు శంకర్రావు వెల్లడించారు. తెలుగు భాష జీవించి ఉండాలంటే తెలుగులో మాట్లాడటం అనేది ఒక నిరంతర ప్రక్రియగా కొనసాగాలని ఆయన పిలుపునిచ్చారు.
తెలుగు భాషా అభివృద్ధికి నేటి కాలంలో అనేక అవకాశాలు ఉన్నాయని తెలుగు ఉపాధ్యాయులు నారాయణరావు పేర్కొన్నారు. మరో ఉపాధ్యాయిని విమల కుమారి మాట్లాడుతూ తెలుగు భాష ఎంతో తీయనిదని, దానిని కాపాడుకోవాల్సిన బాధ్యత అందరిపై ఉందని ప్రసంగించారు. ఈ కార్యక్రమంలో పాఠశాల ఉపాధ్యాయులు మరియు విద్యార్థులు ఉత్సాహంగా పాల్గొన్నారు.
news by: BSS Prasad
0 Comments