పాలకొండ వెబ్ న్యూస్, ఫిబ్రవరి 21, 2026ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ఆయుష్ శాఖ ఆయుష్మాన్ ఆరోగ్య మందిర్ ఆయుర్వేద వైద్యశాల సంకిలి ఆధ్వర్యంలో రేగిడి ఆమదాలవలస మండలం దేవుదల గ్రామంలో ఉచిత వైద్య శిబిరాన్ని నిర్వహించారు. డాక్టర్ డి మోహన్ రావు పర్యవేక్షణలో జరిగిన ఈ కార్యక్రమంలో గ్రామస్తులకు ఉచితంగా వైద్య పరీక్షలు నిర్వహించి మందులను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా డాక్టర్ మోహన్ రావు మాట్లాడుతూ ప్రతి నెల మూడవ శనివారం స్వర్ణాంధ్ర స్వచ్ఛ్ ఆంధ్ర కార్యక్రమంతో పాటు ఉచిత మెడికల్ క్యాంపు ఉంటుందని వెల్లడించారు. ఈ శిబిరంలో యోగా ట్రైనర్స్ ఎన్.నాగభూషణరావు, పి.ఉషారాణి మరియు ఆరోగ్య సిబ్బంది పాల్గొని ప్రజలకు అవగాహన కల్పించారు. ఆయుర్వేద వైద్యం పొందిన రోగులు చికిత్స పట్ల సంతృప్తి వ్యక్తం చేయగా, గ్రామ పెద్దలు ఈ సేవా కార్యక్రమాన్ని హర్షించారు.
news by: BSS Prasad
0 Comments