పాలకొండ వెబ్ న్యూస్: రాష్ట్రంలో భూముల సమస్యల పరిష్కారానికి, ముఖ్యంగా 22ఏ జాబితా నుంచి ప్రైవేటు భూములను తొలగించేందుకు తగిన చర్యలు తీసుకోవాలని పలువురు సభ్యులు కోరారు. బడ్జెట్ సమావేశాల్లో భాగంగా బుధవారం శాసనసభ ప్రశ్నోత్తరాల సమయంలో పలు సమస్యలను సభ దృష్టికి తెచ్చారు. కొలికపూడి శ్రీనివాసరావు తన నియోజకవర్గంలో ఉన్న భూ సమస్యలను సభలో వివరించారు. విష్ణుకుమార్ మాట్లాడుతూ తన నియోజకవర్గంలో గత ప్రభుత్వానికి భూములు ఇవ్వనన్న వారి భూములను 22ఏ జాబితాలో చేర్చారని చెప్పారు.
సభాపతి అయ్యన్నపాత్రుడు స్పందిస్తూ ఈ అంశం రాష్ట్రమంతా ఉన్నందున ఇటీవల ఇచ్చిన మార్గదర్శకాలు కచ్చితంగా అమలయ్యేలా చర్యలు తీసుకోవాలన్నారు. రెవెన్యూశాఖ మంత్రి అనగాని సత్యప్రాసాద్ మాట్లాడుతూ 22ఏ జాబితా నుంచి భూముల తొలగింపును మరింత సరళతరం చేయనున్నట్లు తెలిపారు. ఇందుకు ప్రత్యేక డ్రైవ్లు నిర్వహిస్తామని చెప్పారు. పేదలకు లబ్ధిచేకూరేలా నిషేధిత జాబితాపై నిర్ణయం తీసుకుంటామన్నారు
0 Comments