శ్రీకాకుళం జిల్లా యువత ప్రతిభ మరోసారి ప్రపంచ వేదికపై మెరిసింది. జిల్లా ఆస్పత్రుల సమన్వయ అధికారి (డిసిహెచ్ఎస్) ప్రముఖ అంబేద్కర్ అది నూర్తి కళ్యాణ్ బాబు కుమారుడు అభి చంద్ర కార్తీక్ నూర్తి, ప్రతిష్ఠాత్మక ఆక్స్‌ఫర్డ్ విశ్వవిద్యాలయం మరియు లండన్ స్కూల్ ఆఫ్ ఎకనామిక్స్లో ఒకేసారి ప్రవేశం సాధించి చరిత్ర సృష్టించారు. ప్రపంచంలోనే అత్యంత పురాతనమైన ఆక్స్‌ఫర్డ్‌లో ఎంఫిల్ డెవలప్‌మెంట్ స్టడీస్ (ఎకనామిక్స్) చదివే అవకాశం దక్కింది. కింగ్స్ కాలేజ్ లండన్‌లో ఫస్ట్ క్లాస్‌తో పట్టా పొందిన ఆయన, కేంబ్రిడ్జ్–కింగ్స్ కాలేజ్ సంయుక్తంగా నిర్వహించిన ఎంగెల్స్‌బర్గ్ అప్లైడ్ హిస్టరీ ఫెలోషిప్‌కు కూడా ఎంపికయ్యారు. కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి కింజరాపు రామ్ మోహన్ నాయుడు వద్ద ఇంటర్న్‌గా పనిచేసిన అనుభవం ఆయన ప్రొఫైల్‌ను మరింత బలపరిచింది. ఈ ఘనతపై జిల్లావ్యాప్తంగా హర్షాతిరేకాలు వ్యక్తమవుతున్నాయి.
news by: BSS Prasad
0 Comments