శక్తి టీమ్ అవగాహనా కార్యక్రమం

పాలకొండ వెబ్ న్యూస్: మహిళలు మరియు బాలికల రక్షణే ధ్యేయంగా ప్రభుత్వం రూపొందించిన శక్తి యాప్ పట్ల అవగాహన కల్పించేందుకు పాలకొండ శక్తి టీమ్ ఆధ్వర్యంలో స్థానిక గవర్నమెంట్ డిగ్రీ కాలేజీలో ప్రత్యేక కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా మహిళా ఏఎస్ఐ ఝాన్సీ బాయి మాట్లాడుతూ, ఆపదలో ఉన్న మహిళలు 112 నంబర్‌కు కాల్ చేసి తక్షణ పోలీసు సాయం పొందవచ్చని వివరించారు. ముఖ్యంగా సైబర్ క్రైమ్ మరియు మాదకద్రవ్యాల వల్ల కలిగే అనర్థాలపై విద్యార్థినులకు అవగాహన కల్పించారు. గ్రామంలోకి ఎవరైనా కొత్త వ్యక్తులు వస్తే వెంటనే పోలీసులకు సమాచారం అందించాలని కోరారు. ఏదైనా అత్యవసర సమయంలో బాలబాలికల రక్షణ కోసం 1098, సైబర్ నేరాల ఫిర్యాదుకు 1930, మరియు డ్రగ్స్ నివారణకు 1972 నంబర్లను సంప్రదించాలని సూచించారు. ఈ కార్యక్రమంలో శక్తి టీమ్ సభ్యులు ఏఎస్ఐ జి ఝాన్సీ భాయ్, హెడ్ కానిస్టేబుల్ సిహెచ్ ప్రకృతాంబ, కానిస్టేబుల్స్ ఏ రాము, గిరి ప్రసాద్, శోభ రాణి, కాలేజీ ప్రిన్సిపల్ మరియు ఇతర సిబ్బంది పాల్గొన్నారు.

news by: BSS Prasad

Post a Comment

0 Comments