పాలకొండ వెబ్ న్యూస్: భావితరాలకు బాటలు వేసే మెరుగైన సమాజం కోసం క్రమశిక్షణ కలిగిన విద్య అత్యంత అవసరమని శ్రీకాకుళం నేత్రాసనం బిషప్ రాయరాల విజయ్ కుమార్ అభిప్రాయపడ్డారు. మంగళవారం స్థానిక ఆర్సిఎం చర్చి ప్రాంగణంలో నిర్వహించిన లూర్దు మాత ఇంగ్లీష్ మీడియం స్కూల్ వార్షికోత్సవానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా విజయ్ కుమార్ మాట్లాడుతూ, విద్యార్థులకు క్రమశిక్షణతో కూడిన నాణ్యమైన ఆంగ్ల విద్యను అందించడానికి తమ పాఠశాలలు నిరంతరం కృషి చేస్తున్నాయని పేర్కొన్నారు.దశాబ్దాల కాలంగా వేలాది మందిని విజయవంతులుగా తీర్చిదిద్ది ఉన్నత సమాజం కోసం ఆర్.సి.యం పాఠశాలలు విశేష సేవలు అందించాయని ఆయన కొనియాడారు. విద్యార్థుల ఉజ్వల భవిష్యత్తు కోసం తల్లిదండ్రులు తమ వంతు సహకారం అందించాలని కోరారు. అనంతరం ప్రముఖులు మాట్లాడుతూ విద్య మరియు క్రమశిక్షణ ప్రాముఖ్యతను వివరించారు. ఈ కార్యక్రమంలో విజయ్ కుమార్ ను దుస్సాలువతో ఘనంగా సత్కరించి జ్ఞాపికను అందజేశారు. కార్యక్రమంలో స్కూల్ కరస్పాండెంట్ టి డొమినిక్, ప్రధానోపాధ్యాయురాలు సిస్టర్ సావియో, దూసి దేవరాజ్, పి సుందరరావు, స్లీవరాజ్, అల్ఫోన్స్ తదితరులు పాల్గొన్నారు.
News by: BSS Prasad
0 Comments