పాలకొండలో.. ఈనెల 24న న శిర్లు యాత్రకు ముమ్మరంగా ఏర్పాట్లు

పాలకొండ వెబ్ న్యూస్, ఫిబ్రవరి 22, 2026: పాలకొండలో ఈనెల 24వ తేదీన జరగనున్న శిర్లు పోతన్న స్వామి యాత్ర మహోత్సవానికి నిర్వాహకులు ముమ్మరంగా ఏర్పాట్లు చేస్తున్నారు. మహాశివరాత్రి అనంతరం వచ్చే అష్టమి నాడు ఈ జాతర నిర్వహించడం శతాబ్దాల కాలంగా ఆనవాయితీగా వస్తోంది. ఇందులో భాగంగా 23న కుంకుమ పూజలు, హోమం, అన్నప్రసాద వితరణ చేపడతారు. అదేరోజు సాయంత్రం స్వామివారి తిరువీధి ఉత్సవం, రాత్రి జమికుల పాట ప్రదర్శన ఉంటాయి. 24న తెల్లవారుజాము నుండి భక్తులు జోగి మొక్కులు చెల్లించుకుంటారు. ఆలయ కమిటీ చైర్మన్ కొల్లి చెల్లంనాయుడు ఆధ్వర్యంలో భక్తులకు ఇబ్బందులు కలగకుండా ఏర్పాట్లు చేస్తున్నారు. ఐదు రోజుల ముందు నుండే పూజారి చందనం పూసుకుని గ్రామంలో పర్యటిస్తూ కానుకలు సేకరిస్తున్నారు. ఈ యాత్రలో పాలజంగిడి ప్రదర్శన, సంధూరం కుండపంట ప్రధాన ఆకర్షణగా నిలవనున్నాయి.

​news by: BSS Prasad

Post a Comment

0 Comments