పాలకొండ వెబ్ న్యూస్, తేదీ: 22.02.26..దేవుదల గీతాఆశ్రమంలో గొర్ల దామోదర్ రావు ఆధ్వర్యంలో దివ్యజీవన సత్సంగ సమావేశం అత్యంత భక్తిశ్రద్ధలతో జరిగింది. ఈ కార్యక్రమంలో పాలకొండ సత్యసాయి సేవా సమితి సభ్యులు ఎన్ వి రమణ పాల్గొని భగవద్గీతలోని విశిష్టతను వివరించారు. భగవంతుడికి అత్యంత ప్రీతిపాత్రులైన భక్తుల లక్షణాల గురించి వివరిస్తూ, సమస్త ప్రాణుల పట్ల ద్వేషం లేకుండా, కరుణ, మైత్రి కలిగి ఉండాలని సూచించారు. అహంకారం వీడి, సుఖదుఃఖాలను సమానంగా స్వీకరిస్తూ, దృఢ నిశ్చయంతో మనసును భగవంతుడికి అర్పించే వారే శ్రేష్ఠులని కృష్ణ పరమాత్మ చెప్పిన మాటలను ఆయన గుర్తుచేశారు. ఈ కార్యక్రమంలో నిత్య స్మరణానంద స్వామి, సేవానంద స్వామి, ఎ కామేశ్వరరావు, ఎం మోహన్ దాస్, ఎం సూర్యనారాయణ, ఎస్ త్రినాథస్వామి, మజ్జి శంకరరావు తదితర వక్తలు పాల్గొని ఆధ్యాత్మిక ప్రసంగాలు చేశారు. అనంతరం విచ్చేసిన భక్తులకు నారాయణ సేవ నిర్వహించారు.
0 Comments