పాలకొండ వెబ్ న్యూస్, ఫిబ్రవరి 22,2026:పాలకొండ పరిధిలోని గాయత్రి నగర్ ప్రభుత్వ గిరిజన సంక్షేమ బాలికల వసతి గృహం, ఇందిరానగర్ కాలనీలోని సాంఘిక సంక్షేమ బాలికల వసతి గృహం మరియు గిరిజన సంక్షేమ బాలుర వసతి గృహాల్లో శక్తి టీమ్ ఆధ్వర్యంలో ప్రత్యేక అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా మహిళ ఏఎస్ఐ ఝాన్సీ బాయి మాట్లాడుతూ మహిళలు, బాలికల భద్రత కోసం ప్రభుత్వం అందిస్తున్న శక్తి యాప్ ప్రాముఖ్యతను వివరించారు. ఆపద సమయంలో తక్షణ సహాయం కోసం 112 నంబరును, బాలబాలికల రక్షణకు 1972 మరియు సైబర్ నేరాల ఫిర్యాదుకు 1930 నంబర్లను సంప్రదించాలని సూచించారు. మాదక ద్రవ్యాల దుష్ప్రభావాలు మరియు సైబర్ క్రైమ్ పట్ల అప్రమత్తంగా ఉండాలని విద్యార్థులకు అవగాహన కల్పించారు. ప్రతి ఒక్కరూ క్రమశిక్షణతో మెలిగి బాధ్యతగల పౌరులుగా ఎదగాలని కోరారు. ఈ కార్యక్రమంలో శక్తి టీమ్ సభ్యులు ఝాన్సీ బాయి, ప్రకృతాంబ, రాము మరియు శోభారాణి పాల్గొన్నారు.
news by: BSS Prasad
0 Comments