పాలకొండ వెబ్ న్యూస్, ఫిబ్రవరి 28, 2026:పాలకొండ జూనియర్ సివిల్ జడ్జ్ చందక హరిప్రియ శనివారం స్థానిక సబ్ జైలును ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా ఆమె జైలులోని రిమాండ్ ఖైదీలతో మాట్లాడి వారి కేసుల వివరాలను అడిగి తెలుసుకున్నారు. ఎవరైనా బెయిల్ దరఖాస్తు చేసుకున్నారా లేదా అనే అంశంపై ఆరా తీశారు. అనంతరం జైలులోని వంటశాలను పరిశీలించి ఖైదీలకు అందుతున్న భోజన నాణ్యతను తనిఖీ చేశారు. జైలులో కల్పిస్తున్న మౌలిక సదుపాయాలపై సంతృప్తి వ్యక్తం చేస్తూనే, ఖైదీల సౌకర్యార్థం జైలు సిబ్బందికి పలు కీలక సూచనలు జారీ చేశారు. ఈ పర్యటనలో పాలకొండ న్యాయవాది రామ్మోహన్ మరియు ఇతర సిబ్బంది పాల్గొన్నారు. ఖైదీల హక్కుల పరిరక్షణకు ప్రాధాన్యత ఇవ్వాలని ఆమె అధికారులను ఆదేశించారు.news by: BSS Prasad
0 Comments