పాలకొండ వెబ్ న్యూస్, 01-03-2026: పాలకొండ పట్టణంలో సుమారు 350 సంవత్సరాల చరిత్ర కలిగిన సీతారామ స్వామి దేవాలయంలో ప్రతి ఏటా ఫాల్గుణ మాసంలో డోలోత్సవం నిర్వహించడం ఆనవాయితీగా వస్తోంది. ఈ ఏడాది మార్చి 4వ తేదీ బుధవారం నాడు స్వామి డోలోత్సవాన్ని ఘనంగా నిర్వహించనున్నారు. వెంకటరాయని కోనేరు గట్టు వద్ద ఉన్న సీతారామ స్వామి డోలో మండపంలో ఈ కార్యక్రమం జరగనుంది. ఆ రోజు సాయంత్రం 4 గంటల నుండి స్వామిని భక్తుల దర్శనం కోసం ఉంచి ఈ ఉత్సవాన్ని నిర్వహిస్తారు. పురాతన సంప్రదాయం ప్రకారం జరిగే ఈ వేడుకలో భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొని స్వామిని దర్శించుకోవాలని దేవస్థానం వారు కోరుతున్నారు. ఈ ఉత్సవానికి సంబంధించిన ఏర్పాట్లను పాలకొండ సీతారామ స్వామి దేవస్థానం వారు పర్యవేక్షిస్తున్నారు.
news by: BSS Prasad
0 Comments