ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడును కలిసిన ఎమ్మెల్యే జయకృష్ణ మరియు నేతలు

​పాలకొండ వెబ్ న్యూస్, ఫిబ్రవరి 20, 2026:​విజయవాడలో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడును పాలకొండ ఎమ్మెల్యే జయకృష్ణ మర్యాదపూర్వకంగా కలిశారు. ఎమ్మెల్యేతో పాటు టిడిపి రాష్ట్ర కార్యదర్శి కర్నెన అప్పలనాయుడు, గంట సంతోష్ కుమార్, జాడ శ్రీధర్, కొంచాడ అరుణ్ కుమార్, కొండదాడి రాజేష్, గుప్త తదితరులు ముఖ్యమంత్రిని కలిసిన వారిలో ఉన్నారు. ఈ సందర్భంగా పాలకొండ నియోజకవర్గ పరిధిలోని పలు అభివృద్ధి పనులు మరియు పెండింగ్‌లో ఉన్న ప్రజా సమస్యలపై ముఖ్యమంత్రితో వారు సుదీర్ఘంగా చర్చించారు. నియోజకవర్గ అభివృద్ధికి ప్రభుత్వం తరపున పూర్తి సహకారం అందించాలని కోరారు.

Post a Comment

0 Comments