బడ్జెట్ సమావేశాల్లో అంగన్వాడీలకు వేతనాలు పెంచాలని మరియు మినీ వర్కర్లను మెయిన్ వర్కర్లుగా మార్చాలని కోరుతూ పాలకొండ ఐసిడిఎస్ కార్యాలయంలో అంగన్వాడి వర్కర్స్ అండ్ హెల్పర్స్ యూనియన్ వినతిపత్రం అందజేసింది. ఈ సందర్భంగా సిఐటియు జిల్లా ఉపాధ్యక్షురాలు ఎన్ హిమాప్రభ, యూనియన్ నాయకులు జి జెస్సి బాయ్, జి శారద మాట్లాడుతూ 2019 నుండి వేతనాలు పెరగలేదని, గతంలో జరిగిన సమ్మె సందర్భంగా ఇచ్చిన హామీలను ప్రభుత్వం అమలు చేయాలని డిమాండ్ చేశారు. సుప్రీంకోర్టు మార్గదర్శకాల ప్రకారం గ్రాట్యుటీ నిబంధనలు రూపొందించాలని కోరారు. తమ డిమాండ్ల సాధన కోసం ఫిబ్రవరి 23, 24 తేదీల్లో ఐసిడిఎస్ ప్రాజెక్ట్ కార్యాలయం వద్ద నిర్వహించే రిలే నిరాహార దీక్షలను జయప్రదం చేయాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో ఎం శ్యామల, ఎస్ రజిని, శ్రీదేవి, వై మనీ తదితరులు పాల్గొన్నారు.
news by: BSS Prasad
0 Comments