రవీంద్ర భారతి పాఠశాలలో సైన్స్ ఎక్స్పో

పాలకొండ వెబ్ న్యూస్, ఫిబ్రవరి 28, 2026:​ స్థానిక పాలకొండ రవీంద్రభారతి పాఠశాలలో సైన్స్ ఎక్స్పో సంబరాలు అంబరాన్ని తాకిన రీతిలో నిర్వహించారు. విజ్ఞాన శాస్త్రంలోని వివిధ అంశాలను నమూనాల రూపంలో ప్రదర్శించడానికి వేదికను ఏర్పాటు చేయడం ద్వారా విద్యార్థుల్లో సృజనాత్మకత, వాక్పటిమ పెరుగుతాయని ముఖ్య అతిథి ఉప విద్యాశాఖ అధికారి పి. కృష్ణమూర్తి అన్నారు. ప్రాజెక్టుల పనిని ఇతరులతో పంచుకోవడం వల్ల అవగాహన పెరిగి మిగిలిన విద్యార్థులకు ప్రేరణ కలుగుతుందని గౌరవ అతిథి K. సోంబాబు తెలిపారు. శోధన, ప్రయోగాలు, విశ్లేషణ ద్వారా విజ్ఞాన శాస్త్ర మెళకువలు తెలుసుకుని విద్యార్థులు దేశ ప్రఖ్యాతిని ఇనుమడింపజేయాలని చైర్మన్ ఎంఎస్ మణి ఆకాంక్షించారు. విద్యార్థి దశ నుండే విజ్ఞాన శాస్త్రంలో రాణించడం ద్వారా దేశానికి కీర్తి లభిస్తుందని నార్తాంద్ర జోనల్ ఇంచార్జ్ ఎన్ వెంకటేష్ పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో ప్రిన్సిపల్ టి సుబ్రమణ్యం, డివిజనల్ ఇంచార్జ్ చుక్క శ్రీనివాస్ రావు, ఉపాధ్యాయులు, తల్లిదండ్రులు పాల్గొన్నారు. విద్యార్థుల నమూనాలు ఆహుతులను ఎంతగానో అలరించాయి.

​news by: BSS Prasad

Post a Comment

0 Comments