విద్యార్థుల ప్రయాణ భద్రతే ముఖ్యం

పాలకొండ వెబ్ న్యూస్, ఫిబ్రవరి 28, 2026

​విద్యార్థుల సురక్షిత ప్రయాణమే లక్ష్యంగా జిల్లా ఎస్పీ ఎస్.వి.మాధవ్ రెడ్డి ఆదేశాల మేరకు పార్వతీపురం ఏఎస్పీ మనీషా రెడ్డి ఉత్తర్వులతో పాలకొండలో స్కూల్ బస్సు డ్రైవర్లకు ప్రత్యేక అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఎంవిఐ తంగి వేణుగోపాలరావు మరియు పట్టణ పోలీసులు పాల్గొని డ్రైవర్లకు రోడ్డు భద్రతా నియమాలపై దిశానిర్దేశం చేశారు. వాహనం నడిపేటప్పుడు అతివేగం పనికిరాదని, ట్రాఫిక్ నిబంధనలు పాటిస్తూ బాధ్యతాయుతంగా వ్యవహరించాలని వారు సూచించారు. మద్యం సేవించి వాహనాలు నడిపితే కఠిన చర్యలు ఉంటాయని హెచ్చరించారు. డ్రైవింగ్ సమయంలో మొబైల్ ఫోన్లు వాడకూడదని, వాహన ఫిట్‌నెస్ తనిఖీలతో పాటు బస్సుల్లో ఫస్ట్ ఎయిడ్ బాక్స్, అగ్నిమాపక పరికరాలు తప్పనిసరిగా ఉండాలని పేర్కొన్నారు. పాఠశాల యాజమాన్యాలు డ్రైవర్లకు ప్రతిరోజూ బ్రీత్ అనలైజర్ పరీక్షలు నిర్వహించాలని, విద్యార్థుల భద్రత కోసం అందరూ సమన్వయంతో పనిచేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో ఎం.వి.ఐ శ్రీనివాసరావు మరియు సిబ్బంది పాల్గొన్నారు.

​news by: BSS Prasad

Post a Comment

0 Comments