పాలకొండ వెబ్ న్యూస్, 28 ఫిబ్రవరి 2026.
న్యూఢిల్లీ వేదికగా కమ్యూనికేషన్ యాప్స్ వినియోగదారులకు కీలక హెచ్చరిక వెలువడింది. వాట్సప్ మరియు టెలిగ్రామ్ వంటి యాప్‌లకు సంబంధించిన సిమ్ బైండింగ్ నిబంధనలు మార్చి 1వ తేదీ నుండి దేశవ్యాప్తంగా అమలులోకి రానున్నాయి. ఈ కొత్త నిబంధనల ప్రకారం మొబైల్‌లో సిమ్ కార్డు లేకపోతే ఈ యాప్స్ ఇకపై పనిచేయవు. గతేడాది నవంబర్‌లో ప్రభుత్వం ఈ కొత్త నిబంధనలను ప్రకటించగా వాటి అమలుకు సంబంధించి సంస్థలకు ఇచ్చిన గడువు ఫిబ్రవరి 28తో ముగియనుంది. అంటే మరికొన్ని గంటల్లోనే ఈ కొత్త రూల్స్ అమల్లోకి వస్తాయి. దీంతో ఎవరైనా సిమ్ కార్డు లేకుండా కేవలం వైఫై ద్వారా వాట్సప్ వాడుతుంటే ఆ ఫోన్లలో యాప్ సేవలు నిలిచిపోతాయి. అంతేకాకుండా వాట్సప్ వెబ్ కూడా ప్రతి ఆరు గంటలకు ఒకసారి ఆటోమేటిక్‌గా లాగౌట్ అవుతుందని అధికారులు స్పష్టం చేశారు.news by: BSS Prasad
0 Comments