గ్రామీణ వైద్యుల జాతీయ పార్టీ పార్వతీపురం మన్యం జిల్లా ఇన్చార్జిగా పాలవలస రామి నాయుడు

పాలకొండ వెబ్ న్యూస్..​తేదీ: 27-02-2026:గ్రామీణ వైద్యుల జాతీయ పార్టీ పార్వతీపురం మన్యం జిల్లా ఇన్చార్జిగా పాలవలస రామి నాయుడు నియమితులయ్యారు. ఈ మేరకు పార్టీ ప్రధాన కార్యదర్శి నర్రా సునీత ప్రకటన విడుదల చేశారు. రామీ నాయుడు ప్రజలకు నిత్యం అందుబాటులో ఉంటూ ప్రజాసేవ చేయాలని, పార్టీ బలోపేతానికి కృషి చేయాలని ఆమె సూచించారు. నేటి సమస్యలు రేపటి భవిష్యత్తు అనే అంశంపై ప్రత్యేక చర్చా కార్యక్రమాలు నిర్వహించాలని ఆదేశించారు. నియోజకవర్గ స్థాయి సమస్యలను ఎప్పటికప్పుడు కేంద్ర కార్యాలయానికి నివేదిస్తూ పార్టీ నియమ నిబంధనలకు లోబడి పని చేయాలని స్పష్టం చేశారు. గ్రామీణ ప్రాంతాల్లో పార్టీ కార్యక్రమాలను విస్తృతం చేస్తూ ప్రజల పక్షాన పోరాడాలని ఆమె కోరారు. రామీ నాయుడు నియామకం పట్ల పార్టీ శ్రేణులు హర్షం వ్యక్తం చేస్తున్నాయి.

​news by: BSS Prasad

Post a Comment

0 Comments