పాలకొండ వెబ్ న్యూస్ : 27.02.2026.. మద్యం సేవించి వాహనాలు నడిపే వారిపై పాలకొండ పోలీసులు కొరడా ఝుళిపించారు. విజిబుల్ పోలీసింగ్‌లో భాగంగా చేపట్టిన తనిఖీల్లో పట్టుబడ్డ తొమ్మిది మంది వాహనదారులను జుడిషియల్ ఫస్ట్ క్లాస్ మెజిస్ట్రేట్ హరిప్రియ ఎదుట హాజరుపరిచారు. నిందితులలో ఒకరికి పది వేల రూపాయలు, మిగిలిన ఎనిమిది మందికి తలా రెండు వేల ఐదు వందల రూపాయల చొప్పున మొత్తం ముప్పై వేల రూపాయల జరిమానా విధిస్తూ న్యాయస్థానం తీర్పునిచ్చింది. మద్యం మత్తులో వాహనాలు నడపడం వల్ల జరిగే ప్రమాదాలను అరికట్టేందుకే ఈ కఠిన చర్యలు తీసుకుంటున్నట్లు ఎస్సై వెంకన్న తెలిపారు. అలాగే బహిరంగ ప్రదేశాల్లో మద్యం సేవించి న్యూసెన్స్ చేస్తున్న మరో తొమ్మిది మందిని అదుపులోకి తీసుకుని, వారికి ఒక్కొక్కరికి మూడు వందల రూపాయల చొప్పున జరిమానా విధించారు. నిబంధనలు అతిక్రమిస్తే చట్టపరమైన చర్యలు తప్పవని పోలీసులు హెచ్చరించారు.
news by: BSS Prasad
0 Comments