​బిజెపి ప్రజా వ్యతిరేక విధానాలపై కాంగ్రెస్ పోరాటం

పాలకొండ వెబ్ న్యూస్19 ఫిబ్రవరి, 2026..​పార్వతీపురం మన్యం జిల్లా పార్వతీపురం నియోజకవర్గం ములగ పంచాయతీ పరిధిలోని లచ్చం దొర వలస, కే ములగ గ్రామాలలో ఉపాధి హామీ పరిరక్షణ కోసం బచావో సంగ్రహ్ కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా పార్వతీపురం నియోజకవర్గం ఇన్చార్జ్ బత్తిన మోహన్ మాట్లాడుతూ బిజెపి ప్రభుత్వం అవలంబిస్తున్న ప్రజా వ్యతిరేక విధానాలపై దేశవ్యాప్తంగా పోరాటం సాగుతుందని హెచ్చరించారు. మహాత్మా గాంధీ జాతీయ ఉపాధి హామీ చట్టాన్ని మార్చడం ద్వారా జాతిపితను అవమానించడమే బిజెపి లక్ష్యంగా పెట్టుకుందని విమర్శించారు. పథకానికి ఉన్న గాంధీ పేరును తొలగించడమే కాకుండా, కరెన్సీ నోట్లపై ఉన్న ఆయన ఫోటోను కూడా తొలగించే ప్రయత్నం చేయడం సరికాదని మండిపడ్డారు. గాంధీ పేరుతోనే ఈ చట్టాన్ని కొనసాగించాలని, ఉపాధి హామీని కాపాడుకోవడానికి ఎంతటి పోరాటానికైనా సిద్ధమని స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో జిల్లా కాంగ్రెస్ నాయకులు చొక్కాపు వెంకటరమణ, మండల అధ్యక్షుడు తీళ్ళ గౌరీ శంకరరావు, నాయకులు మజ్జి వెంకటరమణ, మామిడి చంద్ర కుమార్, నిమ్మక పాండు మరియు స్థానిక ప్రజలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.

​news by: BSS Prasad

Post a Comment

0 Comments