పాలకొండ వెబ్ న్యూస్, ఫిబ్రవరి 19, 2026:12వ పిఆర్సి అమలు, జీతాల పెంపు, ఉద్యోగాల క్రమబద్ధీకరణ మరియు సమాన పనికి సమాన జీతం సాధనే లక్ష్యంగా ఈనెల 24వ తేదీన నిర్వహించ తలపెట్టిన చలో విజయవాడ కార్యక్రమాన్ని జయప్రదం చేయాలని ఏపీ మున్సిపల్ వర్కర్స్ అండ్ ఎంప్లాయిస్ ఫెడరేషన్ పాలకొండ కమిటీ గౌరవ అధ్యక్షులు దావాల రమణారావు పిలుపునిచ్చారు. పాలకొండ నగర పంచాయతీ ఆవరణలో కరపత్రాల ఆవిష్కరణ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, గత పిఆర్సి గడువు ముగిసి రెండేళ్లు దాటినా కొత్త వేతనాలు అమలు చేయకపోవడంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. నిత్యవసర ధరలు పెరిగినా ప్రభుత్వాలు పట్టించుకోవడం లేదని విమర్శించారు. మున్సిపల్ కార్మికులకు నేరుగా ప్రభుత్వమే జీతాలు చెల్లించాలని, సంక్షేమ పథకాలు వర్తింపజేయాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో సిహెచ్ సంజీవి, రఘు, శ్రీదేవి, మధు, బి. విస్సు, కే. రాజు తదితరులు పాల్గొన్నారు.
news by: BSS Prasad
0 Comments