​పాలకొండలో శానిటరీ సిబ్బందికి ఘన వ్యర్థాల నిర్వహణపై అవగాహన సదస్సు

పాలకొండలో శానిటరీ సిబ్బందికి ఘన వ్యర్థాల నిర్వహణపై అవగాహన సదస్సు

పాలకొండ వెబ్ న్యూస్..తేదీ: 19 ఫిబ్రవరి, 2026

​పాలకొండ పురపాలక సంఘం కౌన్సిల్ సమావేశ మందిరంలో స్వచ్ఛ ఆంధ్ర – స్వర్ణ ఆంధ్ర కార్యక్రమాల కింద శానిటరీ సిబ్బందికి ఘన వ్యర్థాల నిర్వహణపై గురువారం విస్తృత అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఆల్ ఇండియా ఇన్స్టిట్యూట్ ఆఫ్ లోకల్ సెల్ఫ్ గవర్నమెంట్ ఆధ్వర్యంలో జరిగిన ఈ శిక్షణలో 38 మంది కార్మికులు పాల్గొని వ్యర్థాల నిర్వహణ, ఆరోగ్యం మరియు భద్రతా ప్రమాణాలపై అవగాహన పొందారు. కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా కమిషనర్ ఎస్.జే.వి.రతన్ రాజు, శానిటరీ ఇన్స్పెక్టర్ ఆర్.హేమంత్ కుమార్ హాజరై ప్రసంగించారు. సిబ్బంది విధులు, బాధ్యతలు మరియు పని సమయంలో ఎదురయ్యే ప్రమాదాల నివారణపై వారు దిశానిర్దేశం చేశారు. ముఖ్యంగా పీపీఈ కిట్లు ధరించడం, వ్యక్తిగత పరిశుభ్రత పాటించడం వంటి అంశాల ప్రాధాన్యతను వివరించారు. సిబ్బంది నిబద్ధతతో పనిచేస్తేనే ప్రజారోగ్యం పరిరక్షించబడుతుందని, తద్వారా ఆరోగ్యకరమైన ఆంధ్రప్రదేశ్ నిర్మాణం సాధ్యమవుతుందని వక్తలు పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో డిస్ట్రిక్ట్ కోఆర్డినేటర్ బి.గణపతమ్మ, రిసోర్స్ పర్సన్ సాయి కిరణ్ నందం పాల్గొన్నారు.

News by: BSS Prasad

Post a Comment

0 Comments