పాలకొండ వెబ్ న్యూస్: పాలకొండ నగర పంచాయతీ 19వ వార్డు కస్పా వీధిలో జనసేన పార్టీ ఉమ్మడి శ్రీకాకుళం జిల్లా ఉపాధ్యక్షులు, ఏపీ తూర్పు కాపు కార్పొరేషన్ డైరెక్టర్ గర్భాన సత్తిబాబు పర్యటించారు. స్థానిక ప్రజలు ఎదుర్కొంటున్న కాలువల పూడికతీత, పారిశుద్ధ్యం మరియు మంచినీటి కొళాయిల ఇబ్బందులను ఆయన స్వయంగా అడిగి తెలుసుకున్నారు. తక్షణమే స్పందించిన సత్తిబాబు నగర పంచాయతీ కమిషనర్‌తో ఫోన్లో మాట్లాడి సమస్యల తీవ్రతను వివరించారు. ప్రజల ఇబ్బందులు తొలగేలా తగు చర్యలు తీసుకోవాలని కోరగా, కమిషనర్ సానుకూలంగా స్పందిస్తూ సమస్యల పరిష్కారానికి హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో ప్రభుత్వ ఏరియా ఆసుపత్రి డైరెక్టర్ పెనుగొండ రాజశేఖర్, నాయకులు మాదాసి సంతోష్ కుమార్, డొంపాక సాయికుమార్, మధు మరియు కూటమి నాయకులు పాల్గొన్నారు.
News by: BSS Prasad
0 Comments