పాలకొండ వెబ్ న్యూస్: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రవ్యాప్తంగా ప్రభుత్వ గిరిజన సంక్షేమ ఆశ్రమ మరియు జి.పి.ఎస్ పాఠశాలల్లో గత 12 ఏళ్లుగా సేవలందిస్తున్న 1264 మంది కాంట్రాక్ట్ రెసిడెన్షియల్ టీచర్ల (CRT) భవిష్యత్తుపై అసెంబ్లీలో కీలక చర్చ జరిగింది. ఆమదాలవలస ఎమ్మెల్యే కూన రవికుమార్ ఈ అంశాన్ని సభ దృష్టికి తీసుకువస్తూ సిఆర్టీల సమస్యలను వివరించారు. రాష్ట్ర ప్రభుత్వం త్వరలో విడుదల చేయనున్న మెగా డి.ఎస్.సి నోటిఫికేషన్‌లో ప్రస్తుతం ఈ ఉపాధ్యాయులు పనిచేస్తున్న పోస్టులను చేర్చకుండా మినహాయించాలని ఆయన కోరారు. దశాబ్ద కాలానికి పైగా గిరిజన ప్రాంతాల్లో విద్యాబోధన చేస్తున్న వీరిని మానవీయ కోణంలో ఆదుకోవాలని స్పీకర్ ద్వారా విద్యాశాఖ మంత్రి నారా లోకేష్‌కు విజ్ఞప్తి చేశారు. సుదీర్ఘ కాలంగా సేవలందిస్తున్న తమను డి.ఎస్.సి నుండి మినహాయించి ఉద్యోగ భద్రత కల్పించాలని సిఆర్టీలు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు.
0 Comments