విక్రమ్‌పురంలో అభివృద్ధి పనులకు శంకుస్థాపన

పార్వతీపురం మన్యం జిల్లా వీరఘట్టం మండలం విక్రమ్‌పురం గ్రామంలో అభివృద్ధి పనులకు శ్రీకారం చుట్టారు. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ఆశయాలకు అనుగుణంగా, పాలకొండ ఎమ్మెల్యే నిమ్మక జయకృష్ణ ఆదేశాలతో ఈ కార్యక్రమం నిర్వహించారు. సుమారు 20 లక్షల ఎన్.ఆర్.ఇ.జి.ఎస్ నిధులతో విక్రమ్‌పురం కొత్త కాలనీకి రోడ్డు నిర్మాణ పనులను ప్రారంభించారు.

​ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథులుగా మాజీ తోటపల్లి ప్రాజెక్ట్ చైర్మన్ నిమ్మక పాండురంగ, తోటపల్లి ప్రాజెక్ట్ చైర్మన్ ప్రతినిధి పొదిలాపు కృష్ణమూర్తి నాయుడు హాజరయ్యారు. స్థానిక నాయకులు మాచర్ల నందీశ్వర్ నాయుడు, మాచర్ల అనిల్ బాబు మరియు కూటమి నాయకుల ఆధ్వర్యంలో శంకుస్థాపన వైభవంగా జరిగింది. కార్యక్రమంలో జామి లక్ష్మీనారాయణ, పొన్నాడ నాగేశ్వరరావు, బళ్ళ హరిబాబు, జనసేన జానీ, చింత ఉమామహేశ్వర్, గౌరు నాయుడు, ముద్దా వెంకటరమణ, జంపు శేఖర్, చుక్కా శ్రీను తదితరులు పాల్గొని నియోజకవర్గ అభివృద్ధికి తమ మద్దతు ప్రకటించారు.

News by: BSS Prasad

Post a Comment

0 Comments