పాలకొండ ప్రభుత్వ పాఠశాలలో ఘనంగా యోగివేమన జయంతి

పాలకొండ వెబ్ న్యూస్: స్థానిక ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో యోగివేమన జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా పాఠశాల ప్రధానోపాధ్యాయులు దాసరి నాగభూషణం వేమన చిత్రపటానికి పుష్పమాలలు సమర్పించి నివాళులర్పించారు. కార్యక్రమంలో సంస్కృత పండితులు బౌరోతు శంకర రావు మాట్లాడుతూ 17వ శతాబ్దానికి చెందిన వేమన పద్యాలు అక్షర సత్యాలని, అవి విశ్వ మానవాళికి వేదాలతో సమానమని కొనియాడారు. సామాన్యులకు సైతం అర్థమయ్యే రీతిలో వాడుక భాషలో వేమన పద్యాలు రచించారని గుర్తుచేశారు. వేమన స్ఫూర్తితో తాను శంకర శతకాన్ని రచించానని, 2025 జూన్ నుండి ఫిబ్రవరి 19 వరకు ప్రార్థన సమయంలో రోజుకో పద్యాన్ని విద్యార్థులతో చదివించే అవకాశం కల్పించినందుకు ప్రధానోపాధ్యాయులు, ఉపాధ్యాయులకు కృతజ్ఞతలు తెలిపారు. అనంతరం తెలుగు ఉపాధ్యాయులు వేమన సాహితీ విశిష్టతను వివరించగా, కార్యక్రమంలో పాఠశాల సిబ్బంది, విద్యార్థులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

news by: BSS Prasad

Post a Comment

0 Comments