పాలకొండ వెబ్ న్యూస్, తేదీ: 20 ఫిబ్రవరి, 2026విజయవాడ తాడేపల్లిలోని పార్టీ కేంద్ర కార్యాలయంలో వైయస్సార్ సీపీ అధినేత, ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి వై.యస్ జగన్మోహన్ రెడ్డిని ఆంధ్రప్రదేశ్ శాసన మండలి సభ్యులు పాలవలస విక్రాంత్ గౌరవపూర్వకంగా కలిశారు. ఈ సమావేశం సందర్భంగా రాష్ట్రంలోని తాజా రాజకీయ పరిస్థితులు మరియు శాసన మండలిలో అనుసరించాల్సిన వ్యూహాలపై చర్చించారు. ముఖ్యంగా శాసన మండలిలో ప్రవేశపెట్టిన బడ్జెట్ అంశాలపై మరియు ఇందాపూర్ డైరీ వ్యవహారంపై ప్రభుత్వాన్ని నిలదీయాలని జగన్మోహన్ రెడ్డి సూచించారు. ప్రజల పక్షాన నిలబడి ప్రతిపక్షంగా బాధ్యతాయుతమైన పోరాటం చేయాలని, ప్రజా సమస్యల పరిష్కారం కోసం నిరంతరం శ్రమించాలని విక్రాంత్‌కు దిశానిర్దేశం చేశారు. ప్రభుత్వ వైఫల్యాలను ఎండగడుతూ ప్రజల గొంతుకగా మండలిలో గట్టిగా వినిపించాలని ఈ సందర్భంగా స్పష్టం చేశారు.
news by: BSS Prasad
0 Comments