పాలకొండ మండల పరిషత్ ఆధ్వర్యంలో నిర్వహించిన స్వర్ణాంధ్ర స్వచ్ఛాంధ్ర కార్యక్రమంలో భాగంగా పారిశుధ్య కార్మికులకు చెత్త తరలించే పుష్ కార్టులు మరియు స్వచ్ఛ రథం వాహనాలను ఎమ్మెల్యే నిమ్మక జయకృష్ణ పంపిణీ చేశారు. అనంతరం పచ్చజెండా ఊపి ఈ వాహనాలను ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గ్రామ స్థాయి నుండి స్వచ్ఛతను పాటిస్తేనే దేశం ఆరోగ్యంగా ఉంటుందని అన్నారు. ప్రధాని మోడీ స్ఫూర్తితో ముఖ్యమంత్రి చంద్రబాబు మరియు ఉపముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ రాష్ట్రవ్యాప్తంగా స్వచ్ఛాంధ్ర ఉద్యమాన్ని ముందుకు తీసుకెళ్తున్నారని తెలిపారు. ప్రజలు తమ ఇళ్ల వద్ద తడి, పొడి చెత్తను విడివిడిగా పారిశుధ్య కార్మికులకు అందించి ఈ కార్యక్రమంలో భాగస్వాములు కావాలని కోరారు. చెత్త నుండి సంపద సృష్టి కేంద్రాల ద్వారా రాష్ట్ర ఆర్థిక వ్యవస్థను బలోపేతం చేస్తున్నామని, భవిష్యత్తులో స్వచ్ఛతలో ఆంధ్రప్రదేశ్ దేశానికే రోల్ మోడల్‌గా నిలుస్తుందని జయకృష్ణ ఆశాభావం వ్యక్తం చేశారు.
news by: BSS Prasad
0 Comments