మానవత్వాన్ని చాటుకున్న శక్తి టీం:

పాలకొండ వెబ్ న్యూస్..తేదీ: 18 మార్చి, 2026:పాలకొండ నియోజకవర్గ పరిధిలోని వండువ మరియు పాపంపేట జంక్షన్ల మధ్య మానవత్వం పరిమళించింది. రోడ్డుపై వెళ్తున్న ఒక గుర్తు తెలియని వ్యక్తి హఠాత్తుగా మూర్ఛ వ్యాధితో స్పృహ తప్పి పడిపోయాడు. సరిగ్గా అదే సమయంలో అటుగా వెళ్తున్న శక్తి టీం సభ్యులు ప్రకృతి, గణపతి మరియు గణేష్‌లు ఆ వ్యక్తి పరిస్థితిని గమనించి వెంటనే స్పందించారు. ఏమాత్రం ఆలస్యం చేయకుండా అతనికి ప్రాథమిక చికిత్స అందించి ప్రాణాపాయం నుంచి తప్పించారు. అనంతరం బాధితుడిని సమీపంలోని ఒక దుకాణం వద్దకు తీసుకెళ్లి, స్వయంగా భోజనం పెట్టించి సపర్యలు చేశారు. శక్తి టీం సభ్యులు చూపిన ఈ చొరవను చూసి వండువ జంక్షన్ ప్రజలు పోలీసుల సేవా నిరతిని కొనియాడుతూ శభాష్ పోలీస్ అంటూ ప్రశంసల వర్షం కురిపించారు.

​news by: BSS Prasad

Post a Comment

0 Comments