జనసేనాని స్పూర్తితో కొరికాన ఫౌండేషన్ ఆపన్నహస్తం

పాలకొండ వెబ్ న్యూస్: పార్టీ కోసం అహర్నిశలు శ్రమించి అకాల మరణం చెందిన జనసైనికుల కుటుంబాలకు కొరికాన ఫౌండేషన్ వ్యవస్థాపకులు, సుడా చైర్మన్ కొరికాన రవికుమార్ తన సొంత నిధుల నుండి 15 లక్షల రూపాయల భారీ ఆర్థిక సాయాన్ని ప్రకటించారు. ఎచ్చెర్ల ఎమ్మెల్సీ కార్యాలయంలో నిర్వహించిన ప్రత్యేక కార్యక్రమంలో జనసేన పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, ఎమ్మెల్సీ కొణిదల నాగబాబు చేతుల మీదుగా ఈ చెక్కులను పంపిణీ చేశారు. శ్రీకాకుళం పార్లమెంట్ నియోజకవర్గ పరిధిలోని ఏడు అసెంబ్లీ నియోజకవర్గాలకు చెందిన 15 బాధిత కుటుంబాలను గుర్తించి, ఒక్కో కుటుంబానికి లక్ష రూపాయల చొప్పున ఈ సహాయం అందజేశారు. పార్టీ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా అకాల మరణం చెందిన కార్యకర్తల కుటుంబాలను ఆదుకోవడం రవికుమార్ సేవా దృక్పథానికి నిదర్శనమని నాగబాబు కొనియాడారు. కష్టాల్లో ఉన్న వారికి తోడుగా నిలవడమే జనసేనాని నేర్పిన సంస్కారమని, ఈ సేవా కార్యక్రమం చేయడం తనకు ఎంతో తృప్తినిచ్చిందని రవికుమార్ ఈ సందర్భంగా తెలిపారు.

Post a Comment

0 Comments