పాలకొండ వెబ్ న్యూస్ :ఆంధ్రప్రదేశ్‌లో త్వరలో స్థానిక సంస్థల ఎన్నికల హడావుడి మొదలుకానుంది. రానున్న ఆరు నెలల్లో ఈ ఎన్నికలు జరగొచ్చని ముఖ్యమంత్రి చంద్రబాబు మంత్రులతో పేర్కొన్నారు. వైకాపా చేసిన వినాశనాన్ని ఎండగడుతూనే, కూటమి ప్రభుత్వం సాధిస్తున్న ప్రగతిని ప్రజలకు వివరించాలని మంత్రులకు దిశానిర్దేశం చేశారు. ఏ ఎన్నిక వచ్చినా కూటమిదే విజయం కావాలని ఆయన స్పష్టం చేశారు. పంచాయతీల తరహాలో నీటి సంఘాలు పన్ను వసూలు చేయాలని మంత్రి నిమ్మల రామానాయుడుకు సూచించారు. ప్రభుత్వం చేస్తున్న పనులను మీడియాకు చెప్పడంలో మంత్రులు వెనుకబడి ఉన్నారని అసహనం వ్యక్తం చేశారు. గ్యాస్ కొరత రాకుండా పర్యవేక్షించాలని, ఎలక్ట్రిక్ స్టవ్ ల వాడకం వల్ల పెరుగుతున్న విద్యుత్ డిమాండ్ పై దృష్టి సారించాలని అధికారులను ఆదేశించారు.
0 Comments