ఎన్నికలు నిర్వహించి కొత్త పాలక వర్గాలు బాధ్యతలు స్వీకరించే వరకు లేదా గరిష్టంగా ఆరు నెలల పాటు ఈ స్పెషల్ ఆఫీసర్లు పరిపాలన బాధ్యతలను పర్యవేక్షించనున్నారు. నియమితులైన అధికారులు వెంటనే బాధ్యతలు స్వీకరించాలని ప్రభుత్వం ఆదేశించింది. దీనికి సంబంధించిన నోటిఫికేషన్‌ను ఆంధ్రప్రదేశ్ గెజిట్‌లో ప్రచురించాలని ఉన్నతాధికారులు సూచించారు. ఇకపై నగరాలు మరియు పట్టణాల్లో ప్రజాప్రతినిధుల స్థానంలో అధికారుల పాలన కొనసాగనుంది.
0 Comments